Top Stories

వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడినే కాబట్టి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. భయం తనకు అసలే తెలియదని, అందుకే రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ పదవులను కూడా వదులుకున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందించారు.

జగన్ వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్
ఇంతకుముందు విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందిస్తూ, “మాకు 11 మంది రాజ్యసభ ఎంపీల్లో సాయిరెడ్డితో కలిపి నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. ఇది సాయిరెడ్డికే కాకుండా, ఇప్పటివరకు వెళ్లిపోయినవారికీ, ఇంకా వెళ్లబోయేవారికీ వర్తిస్తుంది. పార్టీ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో నడుస్తుంది. ప్రలోభాలకు లొంగి, భయపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎలా?” అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు కష్టపడి తిరిగి పనిచేస్తే మంచి సమయం వస్తుందని జగన్ పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి షాకింగ్ డెసిషన్
వైసీపీ ప్రధాన నేతగా, జగన్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీతోనూ సంబంధం పెట్టుకోకుండా, ఇకపై వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తానని స్పష్టం చేశారు.

వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి?
రాజీనామా సమయంలో విజయసాయిరెడ్డికి వైసీపీ నేతలు గౌరవం చూపించారు. అయితే, తాజాగా జగన్‌కు కౌంటర్ ఇవ్వడంతో పార్టీ వర్గాలు ఆయనపై విమర్శలు ప్రారంభించాయి. దీని ప్రభావంగా, రాబోయే రోజుల్లో “విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ” వివాదం మరింత ముదిరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Trending today

జగన్ వస్తే ఇట్లుంటదీ..

జమ్మూకశ్మీర్‌లో దేశ రక్షణలో వీరమరణం పొందిన తెలుగు వీరజవాన్ ముదావత్ మురళీ...

రఘురామ షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార కూటమికి చెందిన ఒక ముఖ్య నేత...

వల్లభనేని వంశీకి బెయిల్

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. విజయవాడలోని...

హైదరాబాద్ ఆతిథ్యానికి అందెగత్తెల ఫిదా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు ఇటీవల...

జగన్ ను పొగిడిన వెంకటకృష్ణ

ఏబీఎన్ ఛానెల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ సాధారణంగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ...

Topics

జగన్ వస్తే ఇట్లుంటదీ..

జమ్మూకశ్మీర్‌లో దేశ రక్షణలో వీరమరణం పొందిన తెలుగు వీరజవాన్ ముదావత్ మురళీ...

రఘురామ షాకింగ్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార కూటమికి చెందిన ఒక ముఖ్య నేత...

వల్లభనేని వంశీకి బెయిల్

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. విజయవాడలోని...

హైదరాబాద్ ఆతిథ్యానికి అందెగత్తెల ఫిదా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీమణులు ఇటీవల...

జగన్ ను పొగిడిన వెంకటకృష్ణ

ఏబీఎన్ ఛానెల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ సాధారణంగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ...

కారుతో టాలీవుడ్ హీరో హల్‌చల్‌

హైదరాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కారుతో హల్‌చల్ సృష్టించిన...

ఆర్థిక కష్టాల్లో గ్రామ పంచాయితీలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ అభివృద్ధి రంగం...

కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. హరీష్ రావు క్లారిటీ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో అంతర్గత విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా...

Related Articles

Popular Categories