పవిత్రమైన భవానీ దీక్షా కాలంలో, విజయవాడలో కొందరు పోలీసుల అత్యుత్సాహం పెద్ద వివాదానికి దారి తీసింది. తమ దీక్షా నియమాలు పాటిస్తూ ప్రయాణిస్తున్న భవానీ భక్తులు, అందులోనూ మాల ధరించిన చిన్నారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక, చేయి చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లాలోని కంకిపాడు ప్రాంతం నుంచి కొందరు భవానీ భక్తులు ఆటోలో తాడేపల్లి వైపు ప్రయాణిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వారు తమ భోజనం నిమిత్తం తాడేపల్లికి వెళ్తుండగా, మార్గమధ్యంలో పోలీసులు వారి ఆటోను అడ్డుకున్నారు.
భక్తులందరూ మాల ధరించి ఉండగా, ముఖ్యంగా ఆ గుంపులో ఉన్న భవానీ మాల వేసుకున్న చిన్నారుల పట్ల పోలీసులు తీవ్ర అగౌరవంగా వ్యవహరించారు. కేవలం అత్యుత్సాహంతోనే కారణం లేకుండా పోలీసులు ఈ చిన్నారులపై చేయి చేసుకోవడం జరిగింది. భక్తి భావంతో మాల ధరించి ఉన్న పసి పిల్లలపై పోలీసులు ప్రదర్శించిన ఈ దురుసు వైఖరి పట్ల తోటి భక్తులు మరియు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల తీరుపై భవానీ భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “భవానీ మాలలో ఉన్న చిన్నారులకు ఇచ్చే గౌరవం ఇదేనా?” అంటూ ప్రశ్నిస్తూ, జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ వెంటనే రోడ్డుపై భైఠాయించారు. వారి నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భక్తుల ఆందోళన దృష్ట్యా, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.
ఈ ఘటనపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు సామాన్య ప్రజలు, ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని, దాని సంస్కృతిని బలంగా విశ్వసించే వ్యక్తిగా, మాల ధరించిన భక్తులు, అందులోనూ భవిష్యత్తు తరమైన చిన్నారుల పట్ల జరిగిన ఈ దుశ్చర్యపై ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
“సనాతనీ… ఇప్పుడు సమాధానం చెప్పు? భవానీ మాలలో ఉన్న చిన్నారులకు ఇచ్చే గౌరవం ఇదేనా?” అని పవన్ ను ప్రశ్నించారు. ఇది సనాతన ధర్మాన్ని పాటించే భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అంశంగా ప్రజలు భావిస్తున్నారని స్పష్టమవుతోంది. భక్తి విశ్వాసాలు, సాంప్రదాయాలకు పోలీసులు, అధికారులు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
https://x.com/JaganannaCNCTS/status/1998022616242958767?s=20


