Top Stories

జగన్ ను అడ్డుకున్న పోలీసులు

మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటోంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్‌ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైఎస్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.

వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు పడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ రానున్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరో­డ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్‌ మీదుగా వైఎస్‌ జగన్‌ వినుకొండ చేరుకుంటారు.

టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్‌ జగన్‌ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్‌ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories