Top Stories

మాకు వద్దు ’బాబు’.. ఈయన మాటలు వింటే తట్టుకోలేరు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు పూర్తయింది. ఐదు నెలల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కనీసం ఏడాది నుంచి రెండు నెలలు సమయమైనా పడుతుంది. కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలలు పూర్తికాకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలనుఅమలు చేయకపోవడంతోపాటు గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తేయడమే దీనికి కారణంగా చెబుతున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఐదు నెలలు కూటమి ప్రభుత్వ పాలనను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రజల ముందు మైక్‌ పెట్టి ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగితే ఎంతో మంది తీవ్ర స్థాయిలో దుమ్మెతి పోశారు. నాలుగు నెలలు పాలన దరిద్రంగా ఉందంటూ ఒక పెద్దాయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నాలుగు నెలల్లో ఏమిచ్చాడో చెప్పాలని సదరు మీడియా ప్రతినిధిని ఆ పెద్దాయన తిరిగి ప్రశ్నించాడు. ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ఇస్తున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అక్కడ ఎవడు తింటున్నాడని, అక్కడకు వెళ్లి తింటే నాణ్యత ఏమిటో తెలుస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు సదరు పెద్దాయన. ఆ భోజనం మీరు తింటే బాధేంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ పెన్షన్లును గతంలో జగన్మోహన్‌రెడ్డే ఇచ్చాడని, వీళ్లు కొత్తగా చేసిందేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వాలంటీర్లు పని చేశారని, వారంతా ఇళ్ల వద్దకే తెచ్చి సంక్షేమ పథకాలను అందించారని, వారిని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

వాలంటీర్లు మనుషులు కాదా..? వాళ్లు బతకొద్దా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుఫాన్‌ డబ్బులు ఎవడికైనా సరిగా పంచాడా..? చంద్రబాబు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పెద్దాయన.. ఎవడైనా గొప్పగా ఆడి గురించి చెప్పుకుంటున్నాడా..? అంటూ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చినట్టు మాటలు చెబుతున్నారని, పనులు మాత్రం జరగలేదంటూ చిర్రుబుర్రులాడారు. ఈ పెద్దాయన చెప్పిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగు నెలలకే ఈ స్థాయిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మిగిలిన కాలంలో ఇంకెంత చూడాలో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories