పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె శ్రీజ వివాహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారిని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కలిసి మంత్రి నిమ్మల ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవ్వులు పూశాయి. బాలయ్య సమాధానం కూడా ఓ సినిమా డైలాగ్‌లానే మారింది.
“వస్తాను… కానీ ఎలా వస్తానో చెప్పను” అని చెప్పి, పెళ్లికొచ్చే విషయం స్పష్టంచేశారు. దీంతో పెళ్లి కూతురి కుటుంబం ఇప్పుడు గందరగోళంలో పడింది. బాలయ్య గారు హెలికాఫ్టర్లోనా వస్తారు? లేక మద్రాస్ స్టైల్లో ట్రైన్ మీద నిలబడి వస్తారా? లేక నందమూరి సింహం తరహాలో గర్జిస్తూ ప్రత్యక్షమవుతారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నారు.
ఇక దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా మంత్రి నిమ్మల ఆహ్వానించారు. దీంతో పెళ్లి వేదికపై డైరెక్టర్ బోయపాటి – హీరో బాలయ్య కలిస్తే, పెళ్లి లో బాలయ్య మార్క్ యాక్షన్ ఎంట్రీ కూడా ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.
అయితే పెళ్లి పందిరి దగ్గర ఫైటర్స్ కోసం స్టేజ్ సిద్ధం చేస్తే మంచిదన్నది పెద్దల సూచన. ఎందుకంటే బాలయ్య ఎంట్రీ ఎప్పుడూ “సినిమా”గా మారుతుందేమో అన్న భయం అందరిలో ఉంది.