Top Stories

ఆంధ్రాలో ఈ దౌర్భగ్యమేంది ‘అనితక్కా?’.. వైరల్ వీడియో

‘కట్టులేని ఊరు – గట్టు లేని చెరువు’ మాదిరిగా తయారైంది రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి. గడిచిన ఐదు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఒకవైపు బాలికలు, అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నా.. కూటమి నాయకులు యథేచ్చగా ప్రతిపక్ష పార్టీకి చెందిన క్యాడర్ పై దాడులకు తెగబడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏపీలో రెడ్ బుక్ పేరుతో ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం సుస్పష్టంగా అర్థం అవుతోంది. కానీ కూటమి నాయకులు మాత్రం అబ్బెబ్బే అటువంటిదేమీ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోనే అత్యంత పటిష్టంగా శాంతిభద్రతలను అమలు చేస్తున్న రాష్ట్రం తమదైన అంటూ గొప్పలకు పోతున్నారే తప్ప వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని చక్కదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

రాష్ట్రంలో పూటకో అత్యాచారం, రోజుకో రేప్ అన్న చందంగా అనేక ప్రాంతాల్లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పూటకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతిపై నవీన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కారులో బయటకు తీసుకెళ్లిన ఆ యువకుడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రిలో చేర్పించి సదరు యువకుడు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడడగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తలపై బలంగా కొట్టడం వల్లే ఇలా జరిగినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ, ప్రభుత్వం దీనిపై కనీసం స్పందించలేదు. పైపెచ్చు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు ప్రభుత్వ పెద్దలు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో మెలుగుతున్నారు అన్నట్టుగా కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తూ గడపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మహిళలు రక్షణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ వల్లే ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి అంటూ పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గడిచిన ఐదు నెలల్లో వందలాదిమంది యువతలపై అత్యాచారాలు జరిగాయని, వీటిలో ఏ ఒక్క కేసును ప్రభుత్వం విచారించి కఠిన శిక్షలు విధించిన దాఖలాలు లేకుండా పోయాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శనాస్త్రాలను నెటిటిజనులు సంధిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటే వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై సంబంధిత హోం శాఖ మంత్రి ఏం సమాధానం చెబుతారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories