Top Stories

ఏపీకి మరో వాయుగుండం.. ఇది మరో స్కామ్ గండమే

విపత్తులు వస్తే ఎవరైనా భయపడతారు. వేలాదిమంది నిరాశ్రయులు అవుతారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అందుకే విపత్తు పేరు వింటేనే చాలామంది భయాందోళన చెందుతుంటారు. కానీ, ఏపీలో మాత్రం ప్రకృతి విపత్తులు అంటే కూటమి నేతలు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడంలో కూటమి నేతలకు మించిన వాళ్లు మరొకరు ఉండరు. కొద్ది రోజుల కిందట వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ప్రతిపక్ష వైసిపితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. అయితే ఈ విపత్తును కూడా లాభసాటిగా మార్చుకోవడంలో టిడిపికి మించిన సిద్ధహస్తులు లేరనే చెప్పాలి.

వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించిన పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చూపించిన లెక్కలను చూసి వరదబాధిత ప్రాంతాల్లోని ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడం అంటే ఇదేనేమో అంటూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసిన విపత్తు సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాలు, దానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించిన లెక్కల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ నుంచి మరో వచ్చింది. ఈనెల 22న ఆల్పపీడనం ఏర్పడుతుందని అది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయుగుండం హెచ్చరికతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతుంటే కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. రెండు చేతులతో కోట్లాది రూపాయలు దోచుకునే అవకాశాన్ని వాయుగుండం కల్పిస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలు మాత్రం వాయుగుండం కాస్త మరో స్కాం గండంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాయుగుండం ఎంత పెద్ద స్కాం గండంగా మారుతుందో తెలియడం లేదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సాధారణ ప్రజలు కోరుకుంటుండగా.. కూటమి నేతలు మాత్రం వాయుగుండం పరిధిని పెంచేలా వరుణ దేవుడును కోరుకుంటున్నారు. అప్పుడే కాస్త లెక్క ఎక్కువ చూపించి మరింత బొక్కేందుకు ఎందుకు అవకాశం ఉంటుందని టిడిపి నేతలు భావిస్తుండటమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం మరో స్కాం గండం అవుతుందా.? వరుణ దేవుడు కూటమి నేతలకు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను కాపాడుతాడా చూడాలి మరి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories