Top Stories

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతుంటే, అధికార పక్షం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలితో హాస్పిటల్‌లో చేరటం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది.

పవన్ కళ్యాణ్ డైవర్షన్ రాజకీయాలపై విమర్శలు

విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, ప్రతి కీలకమైన సమయానికి పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల నుండి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పుడు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులు రోడ్డెక్కినా స్పందించకపోవడంపై విద్యార్థులు విస్తుపోతున్నారు.

ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ‘సూపర్ 6’ హామీలపై ఆందోళన చేయగా, పవన్ కళ్యాణ్ ‘తిరుమల లడ్డూ’ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజాదృష్టిని మరల్చినట్టు విమర్శలు వచ్చాయి. అలాగే, ‘సనాతన ధర్మం’ గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విద్యార్థుల ప్రశ్నలు – సమాధానం ఎవరు చెప్తారు?

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కనీసం మద్దతుగా ఒక్క ట్వీట్ కూడా చేయని పవన్ కళ్యాణ్ ఎక్కడ? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాల్సిన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?

ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపుతుందా? లేక సమస్యలను దాటవేయడానికి కొత్తగా మరో అంశాన్ని తెరపైకి తీసుకువస్తారా? అనేది చూడాలి.

 

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories