Top Stories

అరెస్టులపై తగ్గేదేలే.. రెడీ అవుతున్న వైసిపి

ఏపీలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఒకవైపు ప్రతిపక్షాన్ని భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రశ్నిస్తున్న వారిపైన కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వినియోగదారులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. భవిష్యత్తులో మరింత మందిని అరెస్టు చేసేలా ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై కర్కశంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఇదంతా సోషల్ మీడియాను తమ అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాలు వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను, విస్మరించిన హామీలను సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజల దృష్టికి తీసుకు వెళుతున్నారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుండడంతో ఇటువంటి వారిని నియంత్రించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది.

ఇందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా గుంటూరు కన్వీనర్ ను అరెస్టు చేయగా, ఇంటూరి రవికిరణ్ కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి కూడా ప్రభుత్వ చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కొట్టడం, ఇతర వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తే తమకు ఫోన్ చేయాలంటూ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, లీగల్ వ్యవహారాల బాధ్యుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలు వారీగా సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేసే వ్యవహారాలపై దృష్టి సారించేలా కమిటీలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.

తాజాగా న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు అనుగుణంగా సుధాకర్ రెడ్డి కూడా చర్యలు చేపట్టడం వైసిపి శ్రేణులకు భరోసాను కల్పించినట్లు అయింది. పోలీసుల నుంచి వేధింపులు ఎదుర్కొనే సోషల్ మీడియా కార్యకర్తలు తమను సంప్రదించాలని సూచించారు. సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలను తెలియజేశారు. జె సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్ – 9440284455), కొమ్మూరి కనకారావు (మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ – 9963425526), దొడ్డ అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ – 9912205535) నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. పార్టీ నుంచి లభించిన తామింకా తగ్గేదేలే అంటూ వైసీపీ కార్యకర్తలు మరింత యాక్టివేట్ అవుతున్నారు. అరెస్టులకు తాము భయపడేది లేదంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం తప్పెలా అవుతుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Trending today

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

Topics

దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో...

కలిసిన కిరాక్ ఆర్పీ-సీమరాజా.. ఇదేం మా వార్నింగ్

    కిరాక్ ఆర్పీ దంపతులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా...

అఘోరి-శ్రీవర్షిణి పెళ్లి.. షాకింగ్ వీడియోలు

  మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో అఘోరీ మరియు శ్రీ వర్షిణి అనే...

గేదెలకు కుడితి కలుపుతున్న చంద్రబాబు.. వైరల్ వీడియో

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న కొన్ని పనులు...

పవన్ ను తిడుతుంటే నవ్విన రాయపాటి అరుణ.. వైరల్ వీడియో

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాలనపై జరిగిన టీవీ లైవ్...

కిరణ్ పాపం పండింది.. ఇదీ వైసీపీ విజయం

గుంటూరు పోలీసులు వైయస్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో...

ఈ నీచుడిని అరెస్ట్ చేసి లోపలేయండి

  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉన్న కూటమి...

వైసీపీ వ్యతిరేకులు గుర్తుపెట్టుకోండి!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ, కించపరుస్తూ...

Related Articles

Popular Categories