ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా యుద్ధం ఊపందుకుంది. ఒకప్పుడు ప్రత్యర్థి నాయకులపై అవినీతి ఆరోపణలు సభల్లో వినిపించేవి. ఇప్పుడు అయితే పార్టీలు తమ ప్రత్యర్థులపై సాక్ష్యాలతో కూడిన ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా విసురుతున్నాయి.
ఇటీవల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై “ట్రూత్ బాంబ్” పేల్చిన వైసీపీ, ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్‌పై కక్ష కట్టి, బదిలీ చేయించారని వైసీపీ ఆరోపిస్తోంది.
రాజమోహన్ అవినీతికి సహకరించలేదని, అందువల్లే ఆయనను నెల్లూరుకు బదిలీ చేశారని, ఆయన స్థానంలో అర్హతలేని అధికారిని నియమించారని వైసీపీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది. దీనికి తోడు ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించని అధికారులను వేధిస్తారని కూడా ఆరోపించింది.
“ఇదేనా మీ మంచి ప్రభుత్వం?” అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఈ ఆరోపణలపై టిడిపి ఎలాంటి సమాధానం ఇస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ బయటపెట్టిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/YSRCParty/status/1957744484495814870?t=npch_97jyHsuFSEV7J87GA&s=19