Top Stories

వైఎస్ జగన్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక గణాంకాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఆర్థిక స్థితి క్షీణించిందని స్పష్టంగా పేర్కొన్నారు.

కాగ్‌ (CAG) విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్‌ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం గణనీయంగా క్షీణించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలో రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు — పన్నులు మరియు పన్నేతర ఆదాయాలు — భారీగా తగ్గిపోయాయని చెప్పారు. జీఎస్‌టీ, సేల్స్‌ టాక్స్‌ వసూళ్లు కూడా గతేడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు.

ఇది రాష్ట్రంపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడికి సంకేతమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తమ ఖర్చులను సొంత ఆదాయాల కంటే అప్పులపై ఆధారపడి నడుపుతోందని విమర్శించారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు.

ఇక గతంలో వైఎస్సార్‌సీపీ పాలన సమయంలో అప్పులపై చేసిన తప్పుడు ఆరోపణలను గుర్తు చేస్తూ, చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల అప్పు చేశారని ప్రాచుర్యం కల్పించిన విషయాన్ని జగన్ తిరిగి గుర్తు చేశారు. అంతేకాదు, “ఏపీ మరో శ్రీలంక అవుతోంది” అంటూ judi bola భయాందోళనలు రెచ్చగొట్టారని ఆరోపించారు.

అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన కాలంలో రాష్ట్రం తీసుకున్న మొత్తం అప్పు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వెల్లడించిన సంగతి గుర్తు చేశారు.

అదే సమయంలో, చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సంవత్సరం వ్యవధిలోనే రూ.1,37,546 కోట్లు అప్పుగా తీసుకోవడం ఆశ్చర్యకరమైన విషయమని జగన్ ఎద్దేవా చేశారు. ప్రతీ మంగళవారం ‘అప్పుల మంగళవారంగా’ మారిందని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ప్రమాదమేనని, ప్రజల భవిష్యత్తు కోసం తక్షణమే దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ తెలిపారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories