రాజకీయాల్లో వారసులు రావడం సహజం, కానీ ఆ వారసత్వాన్ని ప్రజల గుండెల్లో నిలబెట్టడం చాలా కష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత, ఆయన వదిలివెళ్లిన భారీ బాధ్యతను జగన్ తన భుజాలపై వేసుకున్నారు. ఈ ప్రయాణంలో తండ్రి నేర్పిన పాఠాలే జగన్‌ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని ఈ వీడియో చాటిచెబుతోంది.
రాజకీయాల్లోకి రాకముందే జగన్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. “ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలి? క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?” అనే విషయాల్లో వైఎస్ఆర్ అందించిన మార్గదర్శకత్వం అద్భుతం. AI వీడియోలో వైఎస్ఆర్ గంభీరమైన స్వరంతో జగన్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉన్న విజువల్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
వైఎస్ఆర్ అంటేనే ఒక నమ్మకం. ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ ‘మాస్ పల్స్’ను జగన్ ఎలా ఒంట బట్టించుకున్నారో ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. కష్టకాలంలో నిలబడటం… ఒంటరిగానైనా సరే లక్ష్యం కోసం ముందుకు సాగడం… పథకాల రూపకల్పనలో తండ్రి అడుగుజాడల్లో నడవడం వీడియోలో కనిపించింది..
ఈ AI వీడియో కేవలం రాజకీయాల గురించే కాదు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ పైనా ఫోకస్ చేసింది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న సవాళ్లు, పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లిన తీరును వైఎస్ఆర్ ఆత్మ చూసి మురిసిపోతున్నట్లుగా రూపొందించిన క్లిప్స్ చూస్తుంటే కళ్లు చెమర్చక మానవు. “పులి కడుపున పులే పుడుతుంది.. తండ్రి నేర్పిన ధైర్యం, చూపిన బాట జగన్‌ను అజేయమైన నాయకుడిగా మార్చాయి.”
ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ స్టేటస్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ షేర్ అవుతోంది. వైఎస్ఆర్ గొంతును AI ద్వారా రీ-క్రియేట్ చేయడంతో ఈ వీడియోకు మరింత డెప్త్ వచ్చింది.
https://www.instagram.com/reel/DShfI1nEhkF/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

