ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోయే మహానేత. “ప్రజలే నా శక్తి” అన్న నమ్మకంతో పేదవాడి నుండి రైతువరకు అందరిని చేరే సంక్షేమ పథకాలతో ఆయన నిజమైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణ పథకాలు, 108 అత్యవసర సేవలు వంటి కార్యక్రమాలు ఆయన పాలనలో ప్రతి ఇంటికి చేరాయి. ఈ పథకాలతో ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
అయితే 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదం ఆయన జీవితం, రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారిగా ఆపేసింది. ఆ రోజు ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సంక్షేమ తత్వాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా నిలుస్తుంది. ఓ సంక్షేమ రారాజు శరీరంగా లేకపోయినా, ఆయన జ్ఞాపకం, కలలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా వెలుగొందుతూనే ఉంటాయి.