ప్రతిరోజూ వార్తల్లో, సభల్లో, సోషల్ మీడియాలో, కూటమి నేతల ప్రసంగాల్లో జగన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టీడీపీ అనుకూల మీడియా అందరూ ఒకే రాగం ఆలపిస్తున్నారు… “జగన్, జగన్, జగన్!”
ప్రజలకంటే ముందు కూటమి నేతలే జగన్‌ను గుర్తు చేస్తున్నారు. విమర్శల రూపంలోనైనా, ఆరోపణల రూపంలోనైనా జగన్ పేరు నిరంతరం వినిపిస్తూ ఉండటం వాస్తవానికి ఆయనకే లాభంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రతీరోజూ సభల్లో జగన్ పై నిందలు, ఆరోపణలు చేయడంలో కూటమి నేతలు మునిగిపోతున్నారు. కానీ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ తక్కువగానే ఉంది. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత కూడా, ప్రధాన ఫోకస్ జగన్‌పైనే ఉంది. ఇది వారి పాలనలో ఉన్న లోటుపాట్లను కప్పిపుచ్చే ప్రయత్నమా, లేక జగన్ ప్రభావం ఇంకా తగ్గలేదనే సంకేతమా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జగన్ పేరు నిరంతరం వినిపించడం వల్ల ఆయన ప్రజల్లో గుర్తుండిపోతున్నారు. ఓటమి తర్వాత కూడా 40 శాతం ఓటు వాటాను నిలబెట్టుకున్న జగన్, ఇప్పుడా మద్దతును కూటమి నేతల నోటా మళ్లీ రీకాల్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
“జగన్ అనే పేరు వినిపించకపోతే పూట గడవని పరిస్థితి కూటమి నాయకులది” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ కూటమి నేతలు జగన్ గురించి మౌనం పాటిస్తే ఆయన ప్రజల మనసులోనుండి మెల్లగా దూరి ఉండే అవకాశం ఉండేది. కానీ ప్రతీరోజు జగన్ పేరు ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఈ విధంగా ఆయన ప్రజల్లో సజీవంగా నిలుస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “జగన్ ఫ్యాక్టర్” మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. కూటమి నేతల నిరంతర విమర్శలు ఆయనకు ఆక్సిజన్‌లా పనిచేస్తున్నాయి.ప్రజలలో జగన్ గుర్తు కొనసాగడం వెనుక కూటమి నేతలే కారణమవుతున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చర్చనీయాంశమవుతోంది.
ఎట్టకేలకు, జగన్ పేరు వినిపించకపోతే రాజకీయ రంగం నిశ్శబ్దంగా అనిపిస్తోంది — ఇదే జగన్‌కు పెద్ద ప్లస్!