రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ. కూటమి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యేలకు ప్రతి మద్యం షాప్ నుంచి కమీషన్ రూపంలో డబ్బులు వస్తున్నాయని, ఈ వ్యవహారం అందరికీ తెలిసిన రహస్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఏబీఎన్ చానెల్ లో జరిగిన డిబేట్‌లో ప్రస్తావనకు వచ్చాయి. చర్చలో పాల్గొన్న జనసేన ప్రతినిధి మాత్రం దీనిపై నవ్వుతూ స్పందించారు. చర్చను నడిపించిన యాంకర్ మాత్రం ఈ మాటల్ని కవర్ చేయడానికి, దారిమళ్లించడానికి ప్రయత్నించినా, పరిస్థితిని హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. ఆయన చేసిన “కవర్ డ్రైవ్‌లు”, డైవర్షన్‌లు ఫలించకపోవడంతో చర్చ ఒక దశలో వేడెక్కింది.
మురళీ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూటమి నేతలపై సీపీఎం వేసిన ఈ తూటాలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి. ఇక దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.