భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆడతీరు, కఠోర శ్రమతో టీమిండియా మహిళలు దేశాన్ని గర్వపడేలా చేశారు. కానీ ఈ గొప్ప విజయాన్నీ రాజకీయ కోణంలోకి లాగుతూ, తమ పార్టీ ప్రచారానికి వాడుకోవడంలో టీడీపీ అనుకూల మీడియా మరోసారి వెనుకడుగు వేయలేదు.
టీమిండియా మహిళల విజయం వెనుక నారా లోకేష్ ప్రోత్సాహం ఉందంటూ టీవీ5 చానెల్ యాంకర్ సాంబశివరావు “జాకీలు” వేసి పొగడ్తల పూలు కురిపించడం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. “లోకేష్ ప్రేరణతో భారత మహిళా జట్టు కప్ కొట్టింది” అంటూ ప్రసారం చేసిన సెగ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘వెయ్యకుండా ఉండలేడు… మళ్లీ వేసేశాడు!’ ఇదే ట్యాగ్‌లైన్‌తో నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్‌తో టీవీ5 సాంబశివరావుపై దుమ్మెత్తిపోస్తున్నారు. “ఏ విషయాన్నైనా టీడీపీ ఖాతాలో వేయకపోతే సాంబకి నిద్రపట్టదేమో!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
భారత మహిళా జట్టు కష్టపడి సాధించిన ఈ విజయం దేశమంతా గర్వపడే విషయం. కానీ ఈ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అసహజమని అభిమానులు చెబుతున్నారు. “వాళ్ల కష్టానికి కీర్తి రావాలి, కీర్తికి క్రెడిట్ రావాలి — కానీ రాజకీయ బానిసల ప్రసారం వల్ల గౌరవం తగ్గుతోంది” అంటున్నారు క్రీడాభిమానులు.
టీవీ5 సాంబ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో పేలిపోతున్నారు. “లోకేష్ కూర్చుంటే గెలుస్తారు, సాంబ మాట్లాడితే చాలు స్కోరు పెరుగుతుంది” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మహిళా క్రికెటర్లు దేశానికి గౌరవం తెచ్చారు. వారి విజయం రాజకీయాలకే కాదు, దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. కానీ మీడియా వేదికగా రాజకీయ పిచ్చి ప్రచారం నడపడం క్రీడా సంస్కృతికి హాని. ఎల్లో మైక్‌ఫోన్‌లతో ఎన్ని జాకీలు వేశినా ప్రజలు ఏది నిజమో బాగా అర్థం చేసుకుంటున్నారు.


