హిందూపురం పర్యటనలో ఉన్న నందమూరి బాలకృష్ణ మరోసారి ఆకర్షణగా మారారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో అక్కడి టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మెగా అభిమానులకు అసంతృప్తి కలిగించిన బాలకృష్ణ, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను “తమ్ముడు” అని సంబోధించడం ద్వారా వారిని ఆకట్టుకున్నారు.
సినీ, రాజకీయ రంగాలలో ఎప్పుడూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచే బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు టిడిపి-జనసేన పొత్తు బలపరిచే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.


