Top Stories

జగన్ అభిమానం చూసి ఏడుపు

 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా అక్కడ జనసందోహమే కనిపిస్తోంది. రాప్తాడు నుంచి మచిలీపట్నం వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు—జగన్ కోసం తరలి వస్తున్న అభిమానుల ప్రేమ చూసి టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మాత్రమే కాదు, ఎల్లోమీడియా కూడా అసహనం దాచుకోలేకపోతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాప్తాడులో జరిగిన ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరైన జగన్‌ను స్వాగతించడానికి ఏభైవేలు పైగా జనాలు రోడ్లపైకి రావడం రాజకీయంగా కొత్త చర్చలకు దారి తీసింది. ఏడాదిన్నర కాలంలోనే ప్రజలు ప్రభుత్వంపై విసుగు చెంది, తిరిగి జగన్‌వైపే మొగ్గుచూపుతున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి.

మచిలీపట్నం తుపాను ప్రాంతాలు, సత్తెనపల్లి కుటుంబ పరామర్శ, నెల్లూరు మాజీ మంత్రిని కలిసిన సందర్భం—ప్రతి చోటా ఇదే జన ప్రవాహం. హైదరాబాద్‌లో కూడా జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఎల్లోమీడియాను మరింత ఆగ్రహానికి గురిచేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి సంస్థలు జగన్ పర్యటనలను “బలప్రదర్శన”, “అరాచకం” వంటి శీర్షికలతో చూపించడం పట్ల వైసీపీ తీవ్రంగా ఆక్షేపించింది. అదే సమయంలో చంద్రబాబు ర్యాలీలను “జైలు నుంచి జనం గుండెల్లోకి” అని గౌరవప్రదంగా ప్రచారం చేస్తూ, రెండు వేర్వేరు ప్రమాణాలు పాటించడం పట్ల ప్రశ్నలు లేవున్నాయి.

కోర్టు సందర్శన సమయంలో తీసిన రహస్య వీడియోల ఆధారంగా ఎల్లోమీడియా చేసిన ప్రచారం పట్ల మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సోషల్ మీడియాలో జగన్‌పై వ్యక్తిగత దాడులు, “ఎన్‌కౌంటర్” వ్యాఖ్యలు, న్యాయస్థానాలపై ఒత్తిడి చేయాలన్న వ్యాఖ్యలు..ఇవి రాజకీయ పరిమితులను దాటి వెళ్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక జగన్‌పై వచ్చిన ప్రజాస్పందనను చూసి ఎల్లోమీడియా చేస్తున్న ఏడుపుగొట్టు ప్రచారం చూసి అభిమానులు ఒకే మాట చెబుతున్నారు. “జగన్‌కు దిష్టి తీసినట్టు ఉంది… ఎల్లోమీడియా ఏడుపే ఆయన ప్రజాభిమానానికి నిదర్శనం.”

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories