ప్రపంచ చరిత్రలో ఇంతటి మోసగాడు మరొకరు ఉండరేమో! ఎన్నికల ముందు ప్రజలకు కనకపు సింహాసనాలు, అంతులేని సంపద సృష్టిస్తానని హామీలిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఉత్తుత్తి మాటలుగా తేల్చేస్తున్న తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
“సంపద సృష్టిస్తా”, “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తా”, “ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా చేస్తా” అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ప్రజలకు చెప్పిన మాటలు, గుప్పించిన హామీలు ఇప్పుడు గాలి మాటలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన చేస్తున్న తాజా వ్యాఖ్యలు, చెబుతున్న లెక్కలు చూస్తుంటే.. ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలను నమ్మించేందుకు వేసిన పన్నాగాలు తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది.
ప్రజలు ఆశపడ్డారు, నమ్మారు. చంద్రబాబు చెప్పిన మాయ మాటలు నిజమేనని భ్రమపడ్డారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, ‘రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది’, ‘మాకు చాలా కష్టాలు ఉన్నాయి’ అంటూ ముఖ్యమంత్రి గారే స్వయంగా పదేపదే ప్రకటించడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎన్నికల ముందు ఒక మాట చెప్పి, ఆ తర్వాత అధికారం చేపట్టాక దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం ప్రజలను ఇంతలా మోసం చేయడానికి సిగ్గులేదా? అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం లేనప్పుడు, అంత గొప్పగా సంపద గురించి ఎందుకు మాట్లాడారు? ప్రజలు నమ్మకంతో ఓటేస్తే, వారి నమ్మకాన్ని గాలికొదిలేయడం ఏ రకమైన రాజకీయ నీతి? హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక, ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపించడం ద్వారా బాబు అడ్డంగా బుక్కయ్యాడు అని విమర్శకులు దుయ్యబడుతున్నారు.
చంద్రబాబుకు మించిన మోసగాడు ప్రపంచ చరిత్రలో ఇంకెవరూ ఉండరన్న తీవ్రమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అంటే, ప్రజల ఆవేదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ముఖ్యమంత్రి గారు తాను ఇచ్చిన హామీలపై స్పష్టతనిచ్చి, ప్రజల నమ్మకాన్ని కాపాడే దిశగా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/JaganannaCNCTS/status/1996200940488278156?s=20


