ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి మహా టీవీ యాంకర్ వంశీ చేసిన వ్యాఖ్యలు, ఎలివేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారంటూ వంశీ ఇచ్చిన భారీ ‘జాకీలు’ పెట్టిన తీరుపై నెటిజన్లకు సెటైర్లు వేయడానికి మంచి అవకాశం ఇచ్చాయి.
మహా టీవీ యాంకర్ వంశీ తన టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి పనితీరును ఆకాశానికి ఎత్తేశారు. ఆయన 70 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఇది అసాధారణమని కొనియాడారు.
“పెద్దాయనకి ఈ వయసులో పని తగ్గించాలి.” “ఆయన కాస్త రిలాక్స్ అయ్యేలా చూడాలి.” “లేదంటే, పని తగ్గితే మళ్ళీ ఏదో ఒక పని పెట్టుకుంటారు.” “అందుకే, నారా లోకేష్ పూర్తి బాధ్యతలు తీసుకుని తండ్రికి విశ్రాంతి ఇవ్వాలి.” అంటూ మహా వంశీ సెటైర్లు వేశారు.
సీఎం శ్రమను ప్రశంసిస్తూనే లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలనే సూచనతో యాంకర్ వంశీ ఇచ్చిన ఈ ఎలివేషన్లు.. టీడీపీ మద్దతుదారులను సంతోషపెట్టినా నెటిజన్ల కంటికి మాత్రం ‘అతిశయోక్తి’గా కనిపించాయి.
యాంకర్ వంశీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు వరుస సెటైర్లతో హోరెత్తించారు. చంద్రబాబుకు, యాంకర్ వంశీకి ముడిపెడుతూ వేసిన పంచ్‌లు నవ్వు తెప్పిస్తున్నాయి.”18 గంటలు పని చేయకపోతే పెద్దాయన చంద్రబాబుకు నిద్ర పట్టదు.” “పెద్దాయనకు ఎలివేషన్స్ ఇవ్వకపోతే వంశీకి నిద్ర పట్టదు.” “సీఎం ఆరోగ్యానికి మేలు జరగాలని వంశీ అంతలా వర్క్ ఔట్ చేస్తున్నారు. ఇది కదా అసలు వర్కింగ్ జర్నలిజం!” అంటూ సెటైర్లు వేశారు.
యాంకర్ వంశీ దానికి ఇచ్చిన భారీ ఎలివేషన్లు, లోకేష్‌ను తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నం.. నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నాయనడంలో సందేహం లేదు.

