Top Stories

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో మొదలైంది? ఎవరి కృషి ఎక్కువ? అన్న అంశంపై జరుగుతున్న చర్చలో టీడీపీ, బీజేపీ పార్టీలు అనుకోకుండా ఒక “ట్రాప్”లో పడ్డాయన్న వాదన ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.

వైసీపీ శ్రేణులు తెరపైకి తెచ్చిన వీడియోలు, అధికారిక డాక్యుమెంట్లు, తేదీల ఆధారాలతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం వైసీపీ పాలనలో ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే వేగం పుంజుకుందనే వాదన బలంగా నిలిచింది. ఈ క్రెడిట్ తమదేనని వైసీపీ స్పష్టంగా చెప్పడంతో ప్రతిపక్షాలు దానికి కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వెళ్లాయి.

ఈ మొత్తం వ్యవహారంపై ABN Live స్టూడియోలో జరిగిన చర్చ మరింత చర్చనీయాంశమైంది. యాంకర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ “ఈ క్రెడిట్ ఎవరిది అనే ట్రాప్‌లో టీడీపీ, బీజేపీ పడిపోయాయి”
అని వ్యాఖ్యానించడంతో వాతావరణం మారిపోయింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న టీడీపీ, బీజేపీ ప్రతినిధులు స్పష్టమైన ఖండన చేయలేక మౌనంగా ఉండటం గమనార్హం. అది అంగీకారమేనని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

“భోగాపురం మా జగన్ అన్న కట్టాడు” అన్న నినాదానికి ప్రతిగా టీడీపీ, బీజేపీలు గంటల కొద్దీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, డెమోన్స్ట్రేషన్లు చేస్తూ “జగన్ క్రెడిట్ కాదు” అని నిరూపించేందుకు ప్రయత్నించాయి. కానీ ఆ ప్రయత్నాలే చివరకు వైసీపీ వాదనకు ప్రచారం తెచ్చినట్టయ్యిందన్న విమర్శ వినిపిస్తోంది.

ఏబీఎన్ లైవ్ చర్చ ముగిసే సరికి క్రెడిట్ డిబేట్ పూర్తిగా జగన్ చుట్టూనే తిరిగింది. టీడీపీ–బీజేపీలు సమాధానాలు చెప్పుకోవడానికే పరిమితమయ్యాయి. “ట్రాప్” అన్న పదమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనిపై వెంకటకృష్ణ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ భోగాపురం క్రెడిట్ అంశం చివరకు జగన్‌కే వెళ్లిపోయిందని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

రాజకీయాల్లో ఒక్కసారి ఫ్రేమ్ సెట్ అయితే ఎన్ని కౌంటర్లు ఇచ్చినా ప్రయోజనం ఉండదని ఈ ఉదంతం మరోసారి రుజువైంది.

https://x.com/Samotimes2026/status/2008565301164794159?s=20

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories