పిఠాపురం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినది పవన్ కళ్యాణ్ పోటీతోనే. 2019లో రెండు చోట్ల పవన్ ఓడిపోవడంతో మరోసారి అదే ఫలితం రిపీట్ చేయాలన్న ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మహిళా నేత వంగా గీతను రంగంలోకి దించారు. అయితే ఈసారి పిఠాపురంలో పవన్ విజయం సాధించడంతో ఆ వ్యూహం విఫలమైంది.
వంగా గీత రాజకీయ ప్రయాణం టిడిపితో మొదలై, ప్రజారాజ్యం, వైసీపీ వరకు సాగింది. 2019లో కాకినాడ ఎంపీగా గెలిచిన ఆమె, 2024లో పిఠాపురంలో పవన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయంగా సైలెంట్‌గా ఉండటం చర్చకు దారితీసింది. వైసీపీలో క్రియాశీలత తగ్గిందన్న ప్రచారం మధ్య, ఆమె భవిష్యత్ దారి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో పవన్, వంగా గీతను మంచి మనిషిగా పేర్కొనడం, చిరంజీవి కుటుంబంతో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఇవన్నీ ఆమె జనసేన వైపు చూస్తున్నారన్న ఊహాగానాలకు బలం ఇస్తున్నాయి. అయితే ఇవన్నీ రాజకీయ వర్గాల ప్రచారమేనా? లేక నిజంగా కొత్త అడుగు వేయబోతున్నారా? అన్నది కాలమే చెప్పాలి.
అయితే వంగ గీత సరైన క్యాండిడేట్ కాదని.. పవన్ ను పిఠాపురంలో ఓడించే మంచి అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నాడని సమచారం. వచ్చేసారి పవన్ ను ఓడించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది.


