భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని భావించిన అధినేత చంద్రబాబు సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా సిట్టింగ్‌లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే టికెట్లు మార్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సిట్టింగ్‌లకు పోటీగా ప్రత్యామ్నాయ నేతలను ప్రోత్సహించడం వల్ల పార్టీ లోపలే విభేదాలు పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. టికెట్ భయంతో నాయకులు గందరగోళంలో పడుతుండగా… కేడర్ కూడా అయోమయంలోకి వెళ్తోంది.
ఈ అంతర్గత కలహాలు వైసీపీకి రాజకీయంగా లాభంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ లోపలి సమస్యలు పెరిగితే… ప్రతిపక్షంగా వైసీపీ బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


