Top Stories

ఎంత అన్యాయమా.? పవన్ న్యాయం చేయవా.?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖలోని కూల్ జోన్ యజమాని గణేష్ ఆత్మహత్య వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన కుమార్తె డిమాండ్ చేశారు. తన తండ్రి చావుకు సోనోవిజన్ యజమాని భాస్కర్ మూర్తి కారణం అంటూ గణేష్ కుమార్తె వాపోయారు. తన చావుకు సోనోవిజన్ భాస్కరమూర్తి కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని, చావుకు ముందు తీసుకున్న వీడియో కంటే సాక్ష్యం ఇంకేమి ఉంటుందని సదరు యువతి ప్రశ్నించారు. కానీ పోలీసులు కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్లియర్ గా తన తండ్రి సోనోవిజన్ భాస్కరమూర్తి కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని, నార్మల్ డెత్ అంటూ పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ రాస్తారంటూ గణేష్ కుమార్తె వాపోయారు.

డబ్బులు ఇచ్చి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ వాపోయారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే మా డాడీకి ఎంతో ఇష్టమని, చిన్నప్పటినుంచి ఆయనే ఫాలో అవుతూ ఉన్నారని పేర్కొన్నారు. సోనోవిజన్ భాస్కర్ మూర్తి పెడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి ఆయన తీసుకువెళ్లారని, దసరా సందర్భంగా లైటింగ్ మొత్తం పెట్టి తమ షాపు కనిపించకుండా చేసి ఇబ్బందులకు గురి చేశారని, ఈ విషయాన్ని ఎంతోమందికి తమ కళ్ళముందే చెప్పారంటూ గణేష్ కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఆడపిల్ల పదకొండు గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉండకూడదని చట్టం చెబుతున్న, ఒంటి గంటన్నర వరకు తమను ఎలా పోలీస్ స్టేషన్ వద్ద ఉంచుతారంటూ సదరు ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ బోరును వినిపిస్తూ వేడుకున్నారు. తమలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది రోడ్డున పడాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. మా డాడీ చావుకు కారణమైన వారిని శిక్షించాలని యువతి వేడుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన ఎంతోమంది డబ్బుంటే ఏదైనా చేయవచ్చన్న భావనలో ఎంతోమంది ఉన్నారని, డబ్బుకు న్యాయం లొంగిపోదు అన్న విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ప్రస్తుత పాలకులపై ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సదరు యువతి మాట్లాడిన మాటల వీడియోను మీరు చూడండి.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories