హవ్వ.. బాబు ఏంటిది? ఎలా మిస్ అయ్యాం అసలు?

చంద్రబాబు, లోకేష్ చేసే తప్పులపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో లోకేష్ ఇప్పటికే చాలా సార్లు బుక్ అవ్వగా.. చంద్రబాబు గారు మాత్రం ఆచితూచీ మాట్లాడుతారు. కొన్ని సార్లు చిక్కుతారు. మరికొన్ని సార్లు చిక్కరు.

అయితే తాజాగా తాడిపత్రిలో పండ్ల తోటల పై ప్రజావేదికలో బాబు గారు దొరికారు. తాడిపత్రి నుంచి అరటిపండ్ల ఎగుమతిపై మాట్లాడుతూ బాబు గారు ఠంగ్ స్లిప్ అయ్యారు. తాడిపత్రిలో విరివిగా పండే అరటిపండ్లను ఎగుమతి చేయడానికి బాబు గారి ప్లాన్ చూసి జనాలు అవాక్కయ్యారు.

తాడిపత్రి నుంచి విదేశాలకు ఒక ట్రైన్ వేసి మరీ ఎగుమతి చేస్తామని.. పండ్ల తోటలు వచ్చాయని.. వాటన్నింటిని కలిపి ఎగుమతి చేయించి డబ్బులు సంపాదించేలా చేస్తామని.. ఇదీ తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అంటూ బాబు గారు గొప్పగా చెప్పారు.

కానీ రైల్వే అనేది దేశంలోని అంతర్గత వ్యవస్థ. విదేశాలకు కేవలం విమానాలు, షిప్పుల ద్వారానే వెళ్లాలి. కానీ మన బాబు గారు ఏకంగా విదేశాలకు ట్రైన్ వేస్తాననడం చూసి అంతా అవాక్కయ్యారు. బాబు గారు దొరికేశారంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.