గోదావరి యాస కుర్రాడు మళ్లీ వచ్చేశాడండీ.. ఆయ్.. ఈసారి బాబు పాలనలోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ కాలేదంటే నమ్మండీ.. ఔనండీ బాబు గారు ప్రతీ మంగళవారం అప్పులవారంగా మారుస్తూ అప్పులు తెచ్చుకుంటున్న తీరుపై కడిగిపారేశాడు.
రారా సూస్కుందం టీవీ నుంచి రాజోల్ రిపోర్టర్ రామన్న చౌదరి అంటూ మొదలుపెట్టాడు. ఆదాయం సృష్టిస్తున్నాంటూ గద్దెనెక్కిన బాబు గారు ఇప్పడు అధికారంలోకి వచ్చాక అసలు సంపద సృష్టించకపోగా ప్రతీ మంగళవారం ఆర్బీఐ దగ్గర అప్పులు చేస్తున్న తీరును ప్రశ్నించాడు. అప్పులు తీసుకోవడానికి ఒక వారాన్ని పెట్టుకున్న విజనరీ లీడర్ అంటూ ఎద్దేవా చేశాడు.
అధికారంలోకి వచ్చాక ధరలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్న బాబుకు బుద్ది చెప్పడానికి ప్రజలంతా రెడీ అయిపోయారని విరుచుకుపడ్డారు. ఏపీని అప్పుల పాలు చేసి తాను మాత్రం దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా ఎదిగాడు మన చంద్రబాబు గారని మండపిపడ్డారు.
తెస్తా అన్న ఆదాయం దేవుడు ఎరుగు .. జీఎస్టీని మైనస్ 6 శాతానికి దించేశాడంటే ఈ ఐదేళ్లలో ఆంధ్రాను ఆకునాకిచ్చేస్తాడంటూ విశ్లేషఖలు అంటున్నారని ఈ యువకుడు యాసలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.