బాబు ‘పీఆర్ స్టంట్’.. అదిరిపోలా! వైరల్ వీడియో

చంద్రబాబును పొలిటీషియన్ కంటే అందరూ ఒక మేనేజ్ మెంట్ లో కింగ్ గానే చూస్తారు. ఆయన చేసేది తక్కువ.. మీడియా ద్వారా మేనేజ్ చేసేది ఎక్కువ అంటారు. అందుకే బాబును మించిన రాజకీయ నేత రాజకీయాల్లో ఉండరంటారు. తన లక్ష్యం కోసం ఏమైనా చేసి అధికారం సంపాదించగల ఘటికుడు అంటారు.

2014-19 వరకూ కూడా అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించి ఇలానే మాయ చేశాడు. ఇప్పుడు అలాంటి పొలిటికల్ స్టంట్స్ నే చేశారు. తాజాగా మీడియా ముందర చంద్రబాబు ఒక నకిలీ సాఫ్ట్ వేర్ మేధావులను పట్టుకొని ఫోకస్ చేశారు. అతడు ఎవరా అని ఆరా తీస్తే అదంతా పీఆర్ కోసం బాబు చేసిన స్టంట్ అని తేలింది. ఇంత దిగజారి హైప్ కోసం రాజకీయాలు చేయాలా? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

చంద్రబాబు తాజాగా మళ్లీ పీఆర్ స్టంట్స్ మొదలెట్టారు. ‘నా పేరు పెనమర్తి హరికృష్ణ అని.. నేషనల్ సైబర్ సెక్యూరిటీలో డైరెక్టర్ గా చేస్తున్నానని.. నేను 2005లో మీరు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తన జీతం 3వేల రూపాయలని.. నాడు నాకు కష్టం వచ్చి మెయిల్ చేస్తే వితిన్ 2 నెలల్లో దీన్ని సాల్వ్ చేశారని..అలాంటి మీకు ఏపీకి 1000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామని’ హరికృష్ణ గొప్పగా చెప్పాడు. దీనికి బాబు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. చంద్రబాబు, హరికృష్ణ ఒకరినొకరు గొప్పగా చెప్పుకున్నారు.

అయితే ఇదంతా పీఆర్ కంటెంట్ కోసం చేసిందని అనిపిస్తోంది. ‘ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు మోసం చేస్తారు ? 1000 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ కి రెవిన్యూ తెస్తారు అంట .. 1000 కోట్ల రెవిన్యూ తేవాలి అంటే 5500 కోట్ల పైగా సాఫ్ట్ వేర్ బిజినెస్ జరగాలి’’. అని అందరూ డౌట్ పడ్డారు.

ఈ పసుమర్తి హరికృష్ణ ఎవరు ? అని ఆరాతీస్తే.. ఆయన లెక్క ప్రకారం 2005 లో ఆయన పని చేస్తున్న కంపెనీ ఏమిటి ? ఆయన ప్రొఫైల్ లో చూస్తే.. ఆయన చెప్పినదాంట్లో సొంత వెబ్ సైట్ కూడా పని చేయడం లేదని తేలింది. ఇలాంటివి 2014 నుండి 2019 మధ్యలో ఎన్ని చేశారో అన్నీ తవ్వి బయటకి తీయాలి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి