నిజాన్ని ఏమాత్రం భయపడకుండా బయటపెట్టడం ఏబీఎన్ ఆర్కే నైజం. జగన్ చెల్లి షర్మిలను కూర్చుండబెట్టి వైసీపీపై ఎంత విషం చిమ్మారో అంతా చూశాం. వైఎస్ ఫ్యామిలీని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారు. వీళ్లనే కాదు.. ఇంటర్వ్యూలకు పట్టుకొని వారి పుట్టుపూర్వత్రాలు అన్నీ బయటపెట్టగల సామర్థ్యం ఆర్కే సొంతం..
ఒక్క కేఏ పాల్ కు తప్పితే ఎవరికీ ఇంటర్వ్యూల్లో ఆర్కే భయపడలేదు. మోహన్ బాబు కూడా కాస్త గట్టిగానే ఆర్కే కు గడ్డి పెట్టాడు.
అయితే చంద్రబాబుతోనూ ఆయన చరిత్రను తవ్వి నిజాలు చెప్పిన ఘనత మన ఆర్కే సొంతం. అవును.. చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఏపీలో ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. కేవలం సెకండియర్ మాత్రమే పెట్టారు.
దీంతో జనాలు బాబు నిర్ణయానికి కారణం ఏంటయ్యి ఉంటుందబ్బా అంటూ ఆరా తీస్తున్నారు. దీని వెనక ఏదైనా రాజకీయ కారణం ఉందా? అని శోధిస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో ఏబీఎన్ ఆర్కేతో ఇంటర్వ్యూలో ‘చంద్రబాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యానని’ చెప్పిన వీడియోను ట్రోల్ చేస్తున్నారు. బాబు ఫెయిల్ అయ్యాడు కాబట్టే ఏపీలో ఫస్ట్ ఇయర్ కు పరీక్షలను తీసేశాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.