ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ పగటి వేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను మూటగట్టి అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు.
నిమ్మల గారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు దారుణంగా మోసం చేశారు. ప్రజలనే కాదు.. వలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశాడు. వలంటీర్లకు ఇలానే అలివికాని హామీలిచ్చి మోసం చేశాడు.
తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎన్నికల ముందు వలంటీర్లు, నిరుద్యోగులకు సహా అందరికీ ఉద్యోగాలు ఇస్తానన్న నిమ్మల ఇప్పుడు మాత్రం ఫ్లేట్ ఫిరాయించేశాడు.
బీటెక్, ఎంటెక్ చేసినా ఉపయోగం లేదని.. ఉద్యోగాలు రావడం లేదని.. వాటికన్నా ‘హెయిర్ సెలూర్ లు’ ముద్దు అంటూ మంత్రి నిమ్మల గారు సెలవిచ్చారు. డిఫెరెంట్ డిఫెరెంట్ ఎయిర్ సెలూన్స్ కటింగ్స్ ఆదాయం బాగా వస్తోందని.. చదువుకున్న యువత ఇలాంటి సెలూన్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అందరినీ బార్బర్ లుగా మారాలని హితబోధ చేశారు.
ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు బొచ్చు గీక్కోవాలంటావా? అంటూ నిమ్మల వీడియోను షేర్ చేస్తూ అందరూ మంత్రి నిమ్మల గారిని ఏకిపారేస్తున్నారు.