ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అందరూ భయపడుతూ ప్రెస్ మీట్ లు పెట్టకుండా ఉంటుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకే మాస్ కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత జక్కంపూడి రాజ తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి నాయకులే వైసీపీకి కావాలని.. ఇలా బహిరంగంగా తొడగొట్టే వారి కోసం జగన్ గుర్తింపునివ్వాలని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ లో ఎవరైతే పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడతారో అటువంటి గట్స్ ఉన్న నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేసతున్నారు.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బత్తుల బలరాం కృష్ణాకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు జక్కంపూడి రాజా… ఒక్క నాలుగైదు నెలలు గడవనివ్వు.. నిద్దరలేని రాత్రులు చూపిస్తానంటూ తొడగొట్టారు. నిద్రమాత్రలతో రెడీగా ఉండు అంటూ సవాల్ చేశారు. అధికార మధం బుర్రకెక్కింది అనుకుంట… నీకు సినిమా, క్లాపు మొత్తం కలిపి చూపిస్తానంటూ జక్కంపూడి రాజా సవాల్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.. మీరూ చూసి కామెంట చేయండి.