సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాలి. ఇప్పుడు ఈ గోదావరి యాస యువకుడు వేస్తున్న సెటైర్లకు టీడీపీలో అందరూ రిటైర్ అయిపోతున్నారు. అంతలా పేల్చుతూ పడికట్టు పదజాలాలు.. ప్రాసతో వేస్తున్న ఈ సెటైర్లు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉన్నాయి.
ఈరోజు చినబాబు నారా లోకేష్ పుట్టినరోజు. ఏపీలో టీడీపీ నేతలంతా ఫ్లెక్సీలు, పోస్టర్లతో హోరెత్తించారు. కానీ వైసీపీ తరుఫున నిలబడే ఈ గోదావరి యాస కుర్రాడు తెలిపిన విషెస్ మాత్రం నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంది..
రారా సూస్కుందాం టీవీ నుంచి రావుల పాలెం రిపోర్టర్ రాంబాబును అంటూ సినబాబు లోకేష్ కు వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ యాస పదాలు వింటేనే నవ్వులు పూయిస్తున్నాయి.. ‘రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత.. తల్లికి వందనం ఆపేసి తండ్రికి ఇంధనం పోస్తున్న దానకర్ణుడు.. ఇంగ్లీష్ మీడియంలు ఎందుకు దండగ.. పేద మధ్యతరగతి మాట్లాడండి తెలుగులో ముద్దుగా’ అంటూ లోకేష్ కు బాహుబలి స్టైల్లో ఎలివేషన్లు ఇస్తూ.. ఆయన గాలితీస్తూ వేసిన సెటైర్లు అదిరిపోయాయి..
లోకేష్ వైఫల్యాలు, ఆయన తీరును, ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేసిన వైనాన్ని ఉదాహరణలతో సహా చెబుతూ ఇతగాడు వేసిన సెటైర్లు హైలెట్ గా నిలిచాయి. మీరూ ఈ వీడియో చూసి ‘సినబాబు’కు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పండే..