ఇల్లు అలకగానే పండుగ కాదు.. కానీ ఇల్లు అలకకున్నా పండుగ చేయగల సమర్థులు టీడీపీ మీడియాలో ఉన్నారు. అనామకులను తీసుకొచ్చి టీవీ తెరపై కూర్చుండబెట్టి అవాకులు చెవాకులు చెప్పించి జనంలోకి చొప్పించి దాన్నే నిజం అనేలా చేయడంలో ఎల్లో మీడియాను మించిన వారు లేరు..
45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏదైనా సాధించింది ఏంటంటే.. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 , మహా న్యూస్ లాంటి బలమైన మీడియాలను స్థాపించడమే.. జగన్ విషయంలో ఇదే మైనస్ గా మారుతోంది.
ఇలా విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడో లేదో అలా ఎల్లో మీడియా అందిపుచ్చుకుంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్ పని ఖతమైందని.. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ ఉందని.. ఆయనకు గవర్నర్ పదవి రాబోతోందంటూ చిలవలు పలువలు చేసి చూపిస్తోంది.
తాజాగా మహా టీవీ న్యూస్ లో కనిపించే వంశీ పండగ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఈయన్ను ‘టాల్కం పౌడర్ వంశీ’ అని దెప్పి పొడిచేవాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఎక్కడ లేని సంతోషం తెచ్చుకున్న వంశీ తనకు తోచిన.. నచ్చిన రీతిలో కథనాలు వండి వర్చాడు.. గవర్నర్ గా విజయసాయిరెడ్డి ని పంపి.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఎంపీని బీజేపీ ఇవ్వబోతున్నదని మహా వంశీ కథనాలు వండివర్చాడు.
ఇలా తనకు నోటికి వచ్చినట్టుగా విజయసాయిరెడ్డి రాజీనామాను వక్రీకరించిన మహా వంశీ వీడియో వైరల్ అవుతోంది.