‘బాబు’ మళ్లీ ఏసాడు.. చప్పట్లు తమ్ముళ్లు

మేనేజ్ మెంట్ లో కింగ్ ఎవరు అంటే దేశంలో చెప్పే ఒకే ఒక్క పేరు చంద్రబాబు. అవును బాబును మించిన మేనేజ్ మెంట్ గురువు మరొకరు లేరు. అవును. చంద్రబాబును పొలిటీషియన్ కంటే అందరూ ఒక మేనేజ్ మెంట్ లో కింగ్ గానే చూస్తారు. ఆయన చేసేది తక్కువ.. మీడియా ద్వారా మేనేజ్ చేసేది ఎక్కువ అంటారు. అందుకే బాబును మించిన రాజకీయ నేత రాజకీయాల్లో ఉండరంటారు. తన లక్ష్యం కోసం ఏమైనా చేసి అధికారం సంపాదించగల ఘటికుడు అంటారు.

2014-19 వరకూ కూడా అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించి ఇలానే మాయ చేశాడు. ఇప్పుడు అలాంటి పొలిటికల్ స్టంట్స్ నే చేశారు. తాజాగా మీడియా ముందర రాయచోటిలో నిర్వహించిన ప్రజావేదికలో కొందరు అనామాకులను ముందు పెట్టి తాను సృష్టించిన ప్రాడక్టులు వీరంటూ చంద్రబాబు ఫోకస్ చేశారు. చంద్రబాబు ఒక నకిలీ సాఫ్ట్ వేర్ మేధావులను పట్టుకొని ఫోకస్ చేశారు. అతడు ఎవరా అని ఆరా తీస్తే అదంతా పీఆర్ కోసం బాబు చేసిన స్టంట్ అని తేలింది. ఇంత దిగజారి హైప్ కోసం రాజకీయాలు చేయాలా? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

చంద్రబాబు తాజాగా మళ్లీ పీఆర్ స్టంట్స్ మొదలెట్టారు. ఒక ఎవడో చోటా మోటా కార్యకర్తను పట్టుకొచ్చి.. తాను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని.. వర్క్ ఫ్రం చేస్తున్నానని.. నెలకు ఆరున్నర లక్షల జీతం.. 93 లక్షల ప్యాకేజీ అంటూ మొదలుపెట్టాడు. దీనికి చంద్రబాబు మురిసిపోయి.. చూశారా తమ్ముళ్లు ఇదంతా నేను చేసిన అభివృద్ధి అని ఫోకస్ చేశారు.

నిజానికి ఆరున్నర లక్షలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఉండాల్సిన లక్షణాలే ఆ యువకుడికి లేరు. చదువురాని ఒక టీడీపీ కార్యకర్తను పట్టుకొచ్చి ఇలా ఫోకస్ చేసినట్టుగా ఈజీగా అర్థమవుతోంది. ఇప్పుడీ పీఆర్ స్టంట్ వీడియో నవ్వులు పూయిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి