సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాలి. ఇప్పుడు ఈ గోదావరి యాస యువకుడు వేస్తున్న సెటైర్లకు టీడీపీలో అందరూ రిటైర్ అయిపోతున్నారు. అంతలా పేల్చుతూ పడికట్టు పదజాలాలు.. ప్రాసతో వేస్తున్న ఈ సెటైర్లు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉన్నాయి.
ఈసారి బాబు పాలనలోతులను ప్రశ్నిస్తూ రంగంలోకి దిగేసి టీడీపీని కాస్త గట్టిగానే ప్రశ్నించాడండీ.. ఈ యాసకు టీడీపీ బరెస్ట్ కాలేదంటే నమ్మండీ.. ఔనండీ బాబు గారి పాలన వైఫల్యాలపై పలికిన పలుకులు చూస్తుంటే పంచ్ ఫలక్ నామాకే పంచ్ లా ఉందండీ బాబూ..
ఈ గోదావరి యాస యువకుడు వచ్చేశాడు. కూటమి సర్కార్ పై పంచులతో విరుచుకుపడ్డాడు. చంద్రబాబు , కూటమి సర్కార్, పవన్ కళ్యాణ్ తీరుపై కడిగిపారేశాడు. ఇటీవల ప్రజా వేదికలో ప్రశ్నించిన యువకుడిని పక్కకు లాగేయమన్న చంద్రబాబు వైఖరిని తూర్పారపట్టాడు.
సంపద సృష్టిస్తాను.. ప్రజలకు పంచుతానన్న బాబోరు ఇప్పుడు చేతులెత్తేయడంపై నిలదీశారు. 2 ఎకరాల ఆసామివి 2వేల కోట్లకు ఎదిగినట్టు ఏపీని కూడా నడిపించాలని సెటైర్ వేశారు. ఆరునెలల ముందు ఆరున్నర లక్షల కోట్ల అప్పు అని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్లు అప్పు ఉందని అబద్దాలాడుతున్నారని బాబు ను తూర్పారపట్టారు.
కేంద్ర బడ్జెట్ లో బీహార్ కు కోట్లు కుమ్మరించినా.. అంతే ఎంపీలున్నా ఏపీకి ఏమీ ఇవ్వకున్నా.. నాడు ఏపీ ఎంపీలను ప్రశ్నించిన కాటమరాయుడు పవన్ ఇప్పుడు కామ్ గా ఉన్నాడేంటి? అంటూ నిలదీశాడు ఈ గోదావరి యాస యువకుడు.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.