Top Stories

బాబు, పవన్ , ఎల్లోమీడియాకు ఇచ్చిపడేశాడు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ గోదావరి యాస యువకుడు తనదైన శైలిలో సెటైర్లు వేసి హల్‌చల్ చేస్తున్నాడు. అధికారం కోసం ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అని చెప్పే చంద్రబాబు ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించాడు. ఎన్నికల ముందు వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి, గెలిచాక మాత్రం డబ్బులు లేవని మొసలి కన్నీరు కార్చడం అయోగ్యత కాదా అని ఆయన ప్రశ్నించాడు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినవారు ఇప్పుడు తప్పించుకోవడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని తన సెటైర్లలో చెప్పుకొచ్చాడు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా గోదావరి యాస యువకుడు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ‘ప్రశ్నించడానికి పార్టీ పెట్టానంటాడు.. అధికారంలోకి రాగానే ఆధ్యాత్మిక యాత్రలు అంటూ తిరుగుతున్నాడు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఎన్నికల సమయంలో విప్లవం అని చెప్పి, ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ఏమిటి అని ప్రశ్నించాడు.

ఎల్లో మీడియా వైఖరిని కూడా గోదావరి యువకుడు తనదైన స్టైల్లో కడిగిపారేశాడు. రాష్ట్రంలో మద్యం ద్వారా కేవలం 22 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తే, లక్ష కోట్ల అవినీతి అంటూ ప్రపచం చేసేవారికి కాస్త నిజాలను అర్థం చేసుకునే తలంపు లేదా అని ప్రశ్నించాడు. ప్రజలను మోసం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఈ మీడియా తీరును జనాలు గమనిస్తున్నారని, ఇక భవిష్యత్తులో ఈ తప్పుడు ప్రచారాలు ఎంతమాత్రం పనిచేయవని అతను స్పష్టం చేశాడు.

ఇలా గోదావరి యాస యువకుడు తన ప్రత్యేకమైన పదజాలంతో, విశ్లేషణతో, ప్రాసతో రాజకీయ నేతల తీరును ఎండగట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను మోసం చేసే నాయకులకి, నిజాన్ని దాచే మీడియాకి గుణపాఠం చెప్పేలా ఈ సెటైర్లు ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories