ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీఎస్డీపీ 8.2 శాతంగా నమోదైందని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన సంబరాలు చూస్తుంటే ఆకాశం అందేసినంత సంతోషంగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది బాబోరు! చంద్రబాబు గారు అధికారులకు పెట్టిన టార్గెట్ ఎంతంటే.. అక్షరాలా 15 శాతం! మరి వచ్చిందేమో 8.2 శాతం. అంటే లక్ష్యంలో సగం కూడా చేరుకోలేకపోయారు.
అయినా కానీ చంద్రబాబు గారు ప్రజలను మాయ చేస్తున్నారు. తన పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. సాధించని విజయాన్ని సాధించినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు బాబు గారు?
ఇక సొంత పన్నుల ఆదాయం విషయానికొస్తే.. మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు ఏకంగా 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. కర్ణాటక కూడా 8 శాతం సాధించింది. మరి మన విజనరీ లీడర్ పాలనలో ఎంత వచ్చిందో తెలుసా? కేవలం 2 శాతం మాత్రమే! ఈ దారుణమైన లోపాలను ప్రజలకు ఎందుకు చూపించరు? ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు?
వారం వారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్డీపీ 8.2 శాతం ఎలా నమోదైందో అర్థం కావడం లేదు. ఇది కేవలం అంకెల గారడీనా? లేక ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా?
పచ్చ దినపత్రికల్లో అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు గారి ఆటలు ఇక ఎన్నాళ్లు సాగుతాయి? వాస్తవాలు ఎప్పటికీ దాగి ఉండవు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని పద్ధతి మార్చుకుంటే మంచిది. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు!