Top Stories

ఆ గొంతు ఏది పవన్?

సింహాచలం ఆలయం వద్ద జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్యూలైన్ వద్ద గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాజకీయ వర్గాలు, సామాన్యులు కలిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.

గతంలో జగన్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసిన పవన్, ఇప్పుడు అధికార కూటమి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఎందుకు మౌనంగా ఉన్నారో అంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో “ఆ గొంతు ఏది పవన్?” అంటూ ప్రశ్నిస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి విపత్తులో పవన్ కల్యాణ్ స్పందించని తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ఇప్పటివరకు అక్కడికి వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ పాలనలో జరిగిన ఇలాంటి ఘటనలపై పవన్ కఠినంగా స్పందించేవారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడీ సందర్భంలో మాత్రం ఆయన నుంచి అలాంటి స్పందన రాకపోవడాన్ని “పొత్తు ధర్మం” కింద విరమణగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచే పవన్ ఎక్కడ?”, “రాజకీయ లాభం కోసం మాత్రమే పూర్వంలో గళమెత్తినట్లు ఇప్పుడు కనిపిస్తోంది” అని అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి రీ-లాంచ్ ఆహ్వాన పత్రికలో పేరు లేకపోవడంపై వెంటనే స్పందించిన పవన్, ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మౌనం అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి, ప్రజల సమస్యలపై చొరవ చూపిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నది పెద్ద చర్చగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

Topics

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

రాయపాటికి అరుణపై వెంకటరెడ్డి వైల్డ్ ఫైర్.. వైరల్ వీడియో

టీవీ చర్చా వేదికలు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు, మాటల యుద్ధాలకు కేంద్రంగా...

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్...

బాబు వీడియో చూసి నవ్వితే బాగోదు…. ముందే చెప్తున్నా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ షో ఏదైనా ఉందంటే...

Related Articles

Popular Categories