Top Stories

వైసీపీలో కొత్త వ్యూహ కర్త

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలని, ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించాలని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే పార్టీ లో కీలక మార్పులు చేపట్టి, జిల్లాల పర్యటనకు సైతం సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త నియామకంపై కూడా జగన్ దృష్టిసారించారు.

ఇప్పటివరకు పార్టీకి సేవలందించిన ఐప్యాక్ సంస్థను کنارపరిచి, కొత్త వ్యూహకర్తను రంగంలోకి దింపాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. బెంగళూరులో ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల విజయంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ త‌ర్వాత రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని బృందం పార్టీకి సేవలందించగా, 2024లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో రుషిరాజ్ సింగ్ సర్వీసులపై జగన్ ఆత్మవిమర్శలో పడ్డారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణలో విజయాలు అందించిన సీనియర్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ని వైసీపీకి తీసుకురావాలన్న యోచనలో జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రాథమిక చర్చలు పూర్తైనట్టు ప్రచారం. 2029 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జగన్ ఈ వ్యూహకర్తను పార్టీకి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీ పక్షాన ప్రశాంత్ కిషోర్ సూచనలు అందిస్తుండగా, షో టైం కన్సల్టెన్సీ సేవలూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా మళ్లీ కొత్త వ్యూహకర్త అవసరమన్న భావన జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తానికి వైసీపీలో వ్యూహాత్మక మార్పులు సాకారమయ్యే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలో అధికారికంగా కొత్త వ్యూహకర్త పేరు ప్రకటించే అవకాశముంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories