తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమైన సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు నారా లోకేష్‌తో కలిసి కనిపించిన వ్యక్తి వెంకటేష్ నాయుడు తాజాగా తాడేపల్లి డెన్‌లో వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టల వీడియోలో కనిపించడం కలకలం రేపుతోంది.
ఇటీవలి వరకు వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ “లిక్కర్ స్కాం” అంటూ దుష్ప్రచారం చేసిన టీడీపీ మద్దతుదారులు, పచ్చ మీడియా ఇప్పుడే చెమటలు పట్టుకుంటున్నట్లైంది. “ఏడాదికి ఐదు లక్షల ఆదాయం కూడా లేని వ్యక్తి స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కడం, విదేశీ పర్యటనలు చేయడం, హీరోయిన్స్‌తో జల్సాలు చేయడం ఎలా?” అని జగన్‌ను ప్రశ్నించిన వారే ఇప్పుడు అదే వ్యక్తి చంద్రబాబుతో ఉన్న ఫోటోలతో ప్రశ్నల వర్షం ఎదుర్కొంటున్నారు.
వైసీపీ నేతలు మాత్రం ఇది రాజకీయ కుట్రను బహిర్గతం చేస్తున్నదిగా అభిప్రాయపడుతూ.. “ఇది నిజాలు బయటపడుతున్న సమయం. ఎవరు నిజంగా లిక్కర్ స్కాంలో ఉన్నారో ప్రజలు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని వ్యాఖ్యానిస్తున్నారు.