తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కొత్త స్కాంలో పేరు వినిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళ్తే ట్విట్టర్ ఎక్స్ లో అనేక బోగస్ అకౌంట్లు సృష్టించి “అనారోగ్యం సమస్య ఉంది, సహాయం చేయండి” అంటూ పోస్టులు పెడతారని సమాచారం. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే లోకేష్ సహాయం చేసినట్లు ట్వీట్లు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం తరఫున సహాయం అందిన వెంటనే ఆ పోస్టులు డిలీట్ చేయడం లేదా మొత్తం అకౌంట్ కనపడకుండా పోవడం వంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం పబ్లిసిటీ డ్రామాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ వివాదంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తండ్రి చంద్రబాబుకు స్కామ్స్, అవినీతి ట్యాగ్ తో విపక్షాలు ఎప్పటి నుంచో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొడుకు లోకేష్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారని విమర్శకులు ఎగదాళి చేస్తున్నారు.
నిజంగానే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? లేక నిజంగా సహాయం కోసం ఈ ప్రయత్నమా? అన్నదానిపై స్పష్టత రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
మొత్తానికి, స్కామ్స్, డ్రామాల విషయానికి వస్తే నారా లోకేష్ తన తండ్రిని మించిపోతున్నాడని ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి.
https://x.com/JaganannaCNCTS/status/1965455666803581432