ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మీడియా యాంకర్లు తమదైన శైలిలో స్పందించడం కొత్తేమీ కాదు. అయితే టీవీ5 యాంకర్ సాంబశివరావు విషయంలో మాత్రం ప్రతిసారీ ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన మైక్ పట్టుకున్నా, డిబేట్ నడిపినా, ఎప్పుడూ ఒకే దిశగా విమర్శలు చేయడం గమనించకుండా ఉండలేం.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందంటూ టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలను టీవీ5 లో ప్రదర్శించడం కష్టమేమీ కాదు. కానీ ఆందోళనల అసలు ఉద్దేశ్యాన్ని పక్కన పెట్టి, వాటిని వైసీపీ బలహీనతలుగా చూపించే ప్రయత్నం సాంబశివరావు తరహా వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది.
“వైసీపీ కార్యకర్తలు ఎక్కడికైనా వెళ్తే జగన్ జెండా.. జై జగన్ నినాదం తప్ప ఏదీ ఉండదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పక్షపాతాన్ని బహిర్గతం చేశాయి. రోజంతా లైవ్‌లను చూసి, సాయంత్రం స్క్రీన్‌పై తన నిరాశ, అసహనం మొత్తం వెదజల్లడం ఆయన అలవాటుగా మారిపోయినట్టే ఉంది.
అసలు సమస్యపై చర్చ జరగాలి గానీ, వ్యక్తిగత అక్కసుతో పార్టీ కార్యకర్తలపై వ్యంగ్యాలు విసరడం జర్నలిస్టిక్ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ సాంబశివరావు ప్రతిసారీ “వైఫై మోడ్”లోకి వెళ్లి, ఒకే దిశలో విషం కక్కుతూనే ఉంటారు.
రాజకీయ పక్షపాతం తప్పనిసరి అయితే, మీడియా విశ్వసనీయత ఏ స్థాయిలో నిలుస్తుంది? ప్రజల కోసం ఉన్న వేదికలు పార్టీ మౌఖికంగా మారితే, నిజాన్ని ఎక్కడ వెతకాలి అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నగా మారింది.