ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ షాక్ తగిలింది. కర్నూలు రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్య, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సీఎం చంద్రబాబుకు పరువు నష్టం నోటీసులు పంపించారు. రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
2019లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పటి పులివెందుల సీఐగా శంకరయ్య విధులు నిర్వర్తించారు. ఈ కేసులో రక్తపు మరకలను చెరిపారని ఆరోపణలు చంద్రబాబు పలుమార్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని శంకరయ్య న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు.
ఇక ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ సీఐ నేరుగా సీఎం పై లీగల్ యాక్షన్ తీసుకోవడం విశేషంగా మారింది. ఇప్పుడు దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.