ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని “బుచ్చయ్య తాతయ్య” అని సంబోధించారు. వెంటనే తన పొరపాటును గుర్తించి “క్షమించాలి.. బుచ్చయ్య గారిని తాతయ్య అని అన్నాను” అంటూ చమత్కారంగా చెప్పడంతో సభలో నవ్వుల వర్షం కురిసింది.
ఈ వ్యాఖ్యపై డిప్యూటీ స్పీకర్ స్థానంలో వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజు కూడా వెంటనే స్పందించారు. “బుచ్చయ్య అంకుల్ అంటే బాగుంటుంది కదా” అంటూ సెటైర్లు వేశారు. దీంతో సభలో కాసేపు సరదా వాతావరణం నెలకొంది.
గంభీరమైన చర్చలు, ఆరోపణలు, ప్రతివాదాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చిన్నపాటి హాస్యస్ఫోటాలు సభ వాతావరణాన్ని హాయిగా మార్చాయి. లోకేష్ చేసిన వ్యాఖ్య, రఘురామ ఇచ్చిన సలహా అన్నీ కలిపి సభలోని సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి.
మొత్తానికి ఒక చిన్న జోక్‌తో అసెంబ్లీ హాలే నవ్వులతో మార్మోగిపోయింది.