ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. “తగ్గేదేలే… వదిలేదేలే” అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని. టీడీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, తప్పుడు కేసులకు గురైన వారంతా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీ హయాంలో పలువురు కార్యకర్తలు, నాయకులు తప్పుడు ఆరోపణలు, వేధింపులు ఎదుర్కొన్నారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులపై, టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “వదిలేదే లే” అన్న జగన్ మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రగిలించగా, ప్రతిపక్షంలో భయాందోళనలు రేపుతున్నాయి.
జగన్ ఆవిష్కరించిన ఈ డిజిటల్ బుక్‌కు సంబంధించిన లింక్ కూడా అధికారికంగా విడుదల చేశారు. db.weysrcp.com లో వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయాలని దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.