Top Stories

మహా ‘వంశీ’ని నువ్వే కాపాడాలి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవితోపాటు జగన్‌ గురించిన వ్యాఖ్యలతో బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎల్లో మీడియా వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకంగా మహా టీవీ యాంకర్ వంశీ వ్యవహారం ఇప్పుడు వైరల్ అయింది. బాలయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏమీ లేదని, చిరంజీవి ఆ విధంగా స్పందించడమే తప్పు అని వంశీ బహిరంగంగానే సమర్థించటం పెద్ద కలకలం రేపింది. అంతేకాదు, ఆర్ నారాయణమూర్తి కూడా చిరంజీవికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దానిని వైసీపీ ప్రచార యంత్రాంగం సోషల్ మీడియాలో విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని వంశీ “కడుపు ఉబ్బరం” అన్నట్టుగా వ్యాఖ్యానించడం మరింత చర్చనీయాంశమైంది.

దీనిపై వైసీపీ అనుబంధ శ్రేణులు వంశీపై విరుచుకుపడ్డారు. “బాలయ్య తప్పు ఏమీ చేయలేదని చెప్పడం అంటే, అసెంబ్లీని అవమానించడం కాదా?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతేకాకుండా “టీడీపీకి ఈగ వాలకుండా కాపు కాసే ఎల్లో మీడియా ఇప్పుడు పాపం దేవుడి దెబ్బ తిన్నట్టుంది. అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి.. ఇది న్యాయమా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ ఘటనలతో అసెంబ్లీలో బాలయ్య–చిరంజీవి ఎపిసోడ్ ఒక వైపు, దానికి మీడియా ప్రతిస్పందన మరో వైపు.. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇక వంశీ వ్యాఖ్యలతో ఎల్లో మీడియా పట్ల ప్రతిపక్ష శ్రేణుల్లో ఆగ్రహం మరింత పెరిగింది.

మొత్తానికి బాలయ్య మాటలు, చిరంజీవి స్పందన, ఆర్ నారాయణమూర్తి మద్దతు ఇవన్నీ కలిపి రాజకీయాల్లో కొత్త మంటలు రాజేశాయి. వాటికి వంశీ ‘ఇంధనం’ పోసినట్టయింది.

https://x.com/Samotimes2026/status/1971951217141338493

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories