తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పేరు రఘురామకృష్ణం రాజు. ఒకసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పటికీ ఆయన మాటలు, వైఖరి ఎప్పుడూ చర్చనీయాంశమే.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను తాను “ఫెయిల్యూర్ పొలిటీషియన్” అని పిలుచుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన ప్రయాణం, వైసీపీలో చేరి నరసాపురం ఎంపీగా గెలవడం, తర్వాత జగన్‌పై తిరుగుబాటు చేయడం, చివరికి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలవడం… ఇవన్నీ ఆయన రాజకీయ జీవనంలో పెద్ద మలుపులు.
జగన్ బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయనపై విమర్శలు గుప్పించిన ధైర్యం రఘురామకృష్ణం రాజుకే దక్కింది. అదే ఆయనకు అపారమైన పాపులారిటీని తీసుకొచ్చింది. అయినా తనకు ఆశించిన స్థాయిలో పదవులు, గుర్తింపు రాలేదని బాధపడుతున్నారు. మంత్రి పదవి ఆశించిన చోట డిప్యూటీ స్పీకర్‌గా ఆగిపోవడం కూడా ఆయనకు పశ్చాత్తాపంగా మారింది.
ఇప్పుడు “ఉచిత పథకాలతో ఓట్లు రావు” అంటూ ఇచ్చిన సలహా కూడా కూటమి ప్రభుత్వంపై చర్చను రేపుతోంది. మొత్తానికి రఘురామకృష్ణం రాజు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినా… తాను ఆశించిన ఎత్తుకు చేరలేకపోయాననే భావనలోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది.మరిన్ని సంచలనాలకు ‘ట్రిపుల్ ఆర్’ ఎప్పుడు వేదిక అవుతారో చూడాలి!