ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో జరిగిన తాజా చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గఫూర్ గారు యాంకర్ వెంకటకృష్ణను తన చమత్కార వ్యాఖ్యలతో, ఘాటు విశ్లేషణలతో అసలు మాట రాకుండా చేశారు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల అభిప్రాయాలపై చర్చ జరుగుతుండగా గఫూర్ గారు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
“ప్రస్తుత కూటమి పాలనను ప్రజలు చూసాక జగన్ మోహన్ రెడ్డి ఈజీగా తిరిగి అధికారంలోకి వస్తారు” అని గఫూర్ గారు స్పష్టంగా చెప్పారు. దీనికి వెంటనే యాంకర్ వెంకటకృష్ణ ‘కవర్ డ్రైవ్’ వేయాలని ప్రయత్నించగా, గఫూర్ గారు తనదైన శైలిలో కౌంటర్ వేశారు.
“మీ యెల్లో మీడియా ప్రచారం చేసినట్టు పెట్టుబడుల వెల్లువ ఎక్కడుంది? నాకు ఎక్కడా కనిపించలేదు. ఇదే విధంగా గతంలో కూడా హైప్ చేసి నష్టపోయారు!” అంటూ సూటిగా సెటైర్ వేశారు.
ఇంతకే ఆగకుండా “కర్నూలు డ్రోన్ సిటీలో ఒక్క డ్రోన్ కూడా లేదు, కడప స్టీల్ ప్లాంట్ అయిపోయిందట – కానీ ఇప్పటివరకు అతీ గతీ ఏదీ లేదు. అభివృద్ధి కేవలం మీడియాలోనే కనిపిస్తోంది, నేలమీద మాత్రం ఏమీ జరగట్లేదు” అంటూ గఫూర్ గారు గట్టి వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఏబీఎన్ స్టూడియోలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. యాంకర్ వెంకటకృష్ణ ఒక నిమిషం మాట కూడా లేకుండా కంగారు పడ్డారని, సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు గఫూర్ గారి ధైర్యానికి, స్పష్టతకు అభినందనలు తెలుపుతున్నారు. “వాస్తవాలు చెప్పే విశ్లేషకుడు గఫూర్ మాత్రమే!” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
కూటమి అభివృద్ధి కాగితం మీదే, మీడియా మాయలోనే ఉందని గఫూర్ గారు చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.