ఏటిగట్టున కూసోని సూడుంటే ఈ రాజకీయ నాయకులు చేసే పనులు చూసి నవ్వాలో ఏడ్వాలో తెల్వట్లేదని గోదావరి యాసలో ఓ యువకుడు తన సెటైర్లతో ఏకిపారేశాడు. మొన్న ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి దండాలు పెట్టి ఓట్లు అడుక్కున్నారు. గెలిచాక మొఖం కూడా సూపించట్లేదు. మన గోదావరి జిల్లాల్లో అయితే మరీ దారుణం. కూటమి సర్కార్ అంట! కూడి ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఒక పక్కన వాలంటీర్లు గొల్లుమంటున్నారు. ఎలక్షన్ల ముందు వీళ్ళే కదా ఊరూరు తిరిగి ఓట్లు వేయమని బతిమాలింది. అప్పుడు మంత్రి నిమ్మల గారు వచ్చి “మీకు పదివేల జీతం గ్యారెంటీ. పూత రేకులు తెచ్చి మీ చేతుల్లో పెడతా” అని తెగ ఊదరగొట్టారు. ఇప్పుడు అడిగితే మొఖం చాటేస్తున్నారు. ఆ పూత రేకులు ఏమైనాయో? కనీసం ఆ మాటేమైనా గుర్తుందా? వాలంటీర్లు మాత్రం “మాకు పదివేలు ఇయ్యాల్సిందే” అని నిలదీస్తున్నారు. పాపం, వాళ్ళ బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
ఇంకో పక్కన రైతుల గోడు వినే నాథుడే లేడు. అసెంబ్లీలో ఏమో రైతుల సమస్యల గురించి మాట్లాడకుండా ఆటల పోటీల్లో మునిగి తేలుతున్నారట మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఊర్లో రైతులు పంట పండక, అప్పుల బాధతో చస్తుంటే వీళ్ళేమో కుర్చీలాటలు ఆడుకుంటున్నారు. సిగ్గుండాలి కొంచెం. రైతుల కష్టాలు పట్టించుకోకపోతే ఎట్లా? రేపు మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది?
ఇక మంత్రుల సంగతి చెప్పక్కర్లేదు. తొమ్మిది నెలలు గడిచినా ఏం చేశారో వాళ్లకే తెలీదు. సొంతంగా వాళ్లే “మేం ఏం చేయలేకపోతున్నాం” అని వాపోతున్నారట. మరి ఎందుకు కుర్చీల్లో కూర్చున్నారు? దిగిపోవచ్చు కదా! జనం ఓట్లు వేసింది మీరు ఏదో చేస్తారని కదా? ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎట్లా?
మొత్తానికి ఈ కూటమి సర్కార్ గోదాట్లో మునిగిన ఏనుగులా తయారైంది. కదలదు, మెదలదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి. జనం మాత్రం అయోమయంలో ఉన్నారు. ఈ నాయకులు ఎప్పుడు మారతారో? మన గోదావరి గడ్డ మీద మంచి పాలన ఎప్పుడు చూస్తామో? అని ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ ఈ తీరు చూస్తుంటే ఆశ కూడా చచ్చిపోయేలా ఉంది.
ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో