Top Stories

హామీలపై నిలదీత

గోదావరి తీరానికి ప్రత్యేకమైన యాసతో ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై వేసిన సెటైర్లు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ యువకుడు చంద్రబాబుపై ప్రత్యేకంగా నిప్పులు చెరిగాడు.”ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు బయట గొప్పగా చెబుతాడండి.. కాని లోపల మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎదురు గొణిగిన వాళ్లను జైళ్లలోకి పంపిస్తున్నారు. ఇవేనా ప్రజాస్వామ్య విలువలు?” అంటూ నిలదీశాడు.

ఆరోగ్యశ్రీపై మాట్లాడుతూ, “నిధులు లేవంటూ చేతులెత్తేస్తాడు.. కానీ అదే చేతులతో మూడొందల పడకల ఆస్పత్రులు కట్టిస్తానంటాడు. మాటలు బాబుకి జోలపాలు.. ప్రజలకు మాత్రం దిక్కులేదు” అని ఎద్దేవా చేశాడు.

తిరుమల లడ్డూ వివాదాన్ని టార్గెట్ చేస్తూ, “తిరుమల తిరుపతిని కల్తీ లడ్డూ డొక్కుతో రాజకీయాల్లోకి లాగిన బాబు.. ఇప్పుడు కల్తీ లేదన్న రిపోర్టొచ్చేసరికి మాత్రం – సన్నాయి నొక్కలతో తప్పించుకుంటున్నాడు” అంటూ చురకలు అంటించాడు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ,”ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానన్న బాబు.. గెలిచాక మాత్రం ‘ఎలా సృష్టించాలో మీరు చెవిలో చెప్పండి’ అంటూ చేతులెత్తేశాడు. ఇదేనా దశాబ్దాల అనుభవం?” అంటూ ప్రశ్నించాడు.

ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్ అవుతుంది.ప్రస్తుత రాజకీయాల్లో నిరాశకు గురవుతున్న యువత భావాలను ఈ యువకుడు తేటతెల్లంగా వ్యక్తీకరించాడంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.పార్టీలకు అతీతంగా ఈ తరం ఓ కొత్త స్వరం వినిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories