Top Stories

కూటమి పాలనపై ఆర్కే రివ్యూ

ఏపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనను పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చాలా వరకు మీడియా నివేదికలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.

ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఛానల్‌గా పేరు తెచ్చుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఈసారి మాత్రం ఊహించని విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపింది. ఛానల్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ తన తాజా రిపోర్ట్‌లో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమ భూకబ్జాలు, ఇసుక మాఫియా, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు, రెగ్యులర్ పాలనలో అవ్యవస్థలు వంటి అంశాలపై రాధాకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు.

గతంలో వైసీపీ ప్రభుత్వంపై ఇదే ఛానల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అప్పట్లో భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక అక్రమాలు అధికంగా ఉన్నాయంటూ అనేక కథనాలు ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు అదే ఛానల్ కూటమి ప్రభుత్వాన్నీ ఇలాంటి ఆరోపణల నుండి మినహాయించడం లేదు. ఇప్పుడూ ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నది ఏబీఎన్ ఇచ్చిన సంకేతం.

ఈ రిపోర్టుతో చంద్రబాబుకే ఏకంగా హెచ్చరికలు ఇచ్చినట్టు వ్యవహరించడమే గాక.. ఈ ప్రభుత్వం పాలనలో పారదర్శకత లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు అనుచరుల్లో ఆందోళనకు దారితీస్తోందని తెలుస్తోంది.

వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘చంద్రబాబు మౌత్‌పీస్’గా పేరుగాంచిన ఏబీఎన్ ఛానల్ నుంచే ఇలాంటి విమర్శలు రావడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ.. కూటమి పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని అంటోంది.

మరోవైపు, ఏబీఎన్ రాధాకృష్ణ ఇలా విమర్శలు గుప్పించడంలో అంతర్లీన కారణాలు ఉన్నాయంటూ.. తెర వెనుక రాజకీయం జరిగిందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఇది నిజం కాని అపోహనా అన్నది త్వరలోనే తేలనుంది.

ఏదేమైనా.. ఈ రిపోర్టుతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయడం ఖాయం.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories